సిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా మిల్లెట్ గణేశుడు

- హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ప్రతిష్ట

- మిల్లెట్ ల ప్రాధాన్యత ను చెప్పేందుకు ఏర్పాటు 

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం గా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్ ల ప్రాముఖ్యత , ఆరోగ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యతను గురించి ప్రజల్లో  అవగాహన పెంచడానికి సిరిసిల్ల పట్టణంలోని హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్‌ లో ఆసుపత్రి నిర్వాహకులు మిల్లెట్ ( చిరు , తృణ ధాన్యాలు) లతో చేసిన గణేశుడిని ప్రతిష్టించారు.

5 అడుగుల పరిమాణం గల

పర్యావరణ అనుకూల  చిరుధాన్యగణపతి

(మిల్లెట్) గణేశుడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకూ 

మిల్లెట్‌తో చేసిన వివిధ వంటకాలు 9 రోజుల పాటు రోజువారీ భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు.

 మిల్లెట్ల యొక్క పోషక ప్రయోజనాలు:

 మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అవసరమైన పోషకాల యొక్క అద్భుతమైన మూలం. అవి గ్లూటెన్-ఫ్రీ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, మరియు అధిక యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి, ఇది వాటిని బియ్యం లేదా గోధుమలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చేస్తుంది.

.